ప్రజాశక్తి-అజిత్‌సింగ్‌నగర్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామాగా, అభివద్ధికి కేంద్ర బిందువుగా ముందుకు సాగుతోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58 వ డివిజన్ 241 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రెండో రోజు సాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, అధికారులతో కలిసి వానపాల వారి వీధిలో ఎంఎల్‌ఎ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, శర్మ, రాజు, భోగాది మురళి, తోపుల వరలక్ష్మి పాల్గొన్నారు.










