Nov 24,2022 22:39

ప్రజాశక్తి-జగ్గయ్యపేట
జగ్గయ్యపేట-3 సచివాలయం పరిధిలోని 4 వార్డులో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం గురువారం శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లా డుతూ విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి మనబడి నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర, వైస్‌ చైర్మన్‌ తుమ్మల ప్రభాకర్‌, హఫీజున్నిసా ఫిరోజ్‌ ఖాన్‌, రాష్ట్ర మైనింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బత్తుల రామారావు, పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్‌ బాజీ, యువజన విభాగం అధ్యక్షులు ఆవాల భవాని ప్రసాద్‌ పాల్గొన్నారు.