ప్రజాశక్తి-జగ్గయ్యపేట
పట్టణంలోని 29వ వార్డు అయ్యప్ప నగర్‌లో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకాలు ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని తూచా తప్పకుండా కరోనా కష్టకాలంలో ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తున్నారని తెలిపారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, హఫీజున్నిసా ఫిరోజ్ ఖాన్, పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ బాజి, యువజన విభాగం అధ్యక్షులు ఆవాల భవాని ప్రసాద్ పాల్గొన్నారు.










