Jul 24,2022 23:29

సంక్షేమ పథకాల బ్రోచర్‌ను అందిస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి

ప్రజాశక్తి- ఆనందపురం : మండలంలోని బంటుపల్లి వారి కళ్లాల్లో ఆదివారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. గ్రామంలో తాగు నీటి సమస్య ఉందని, పారిశుధ్య సమస్యలు తలెత్తి వ్యాధులకు కారణమవుతున్నాయని, కాలువలు లేవని ఎమ్మెల్యేను పలువురు నిలదీశారు. గొట్టిపల్లి వారి కల్లాలలో తాగు నీటి కుళాయిల ఏర్పాటుచేయాలని మహిళలు కోరారు.
పంచాయతీలో ఉన్న తాగునీరు, పారిశుధ్యం సమస్యలపై ముత్తంశెట్టికి జనసేన నాయకులు డాక్టర్‌ పి.సన్యాసిరావు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి వైసిపి ఇన్‌ఛార్జి ముత్తంశెట్టి మహేష్‌, జడ్‌పిటిసి సభ్యులు కోరాడ వెంకటరావు, ఎంపిపి మజ్జి శారదాప్రియాంక, సర్పంచ్‌ కోన పైడిరాజు, కోన శ్రీనివాసరావు, బంటుపల్లి జనార్ధనరావు, బంటుపల్లి చందర్రావు, తహశీల్దార్‌ లోకవరపు రామారావు, ఎంపిడిఒ లవరాజు, ఎలక్ట్రికల్‌ ఎఇ సురేష్‌కుమార్‌, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.