'గడపగడపకు మన ప్రభుత్వం'
ప్రజాశక్తి-సంగం : సంగం బిట్-3 సచివాలయం పరిధిలో శుక్రవారం ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఆలయంలో ఎంఎల్‌ఎ మేకపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్లిన ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారికి అందచేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించిన అనంతరం నియోజకవర్గంలో 93 సచివాలయాల్లో 78 సచివాలయాల్లో కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సంగం మండలంలోని 13 సచివాలయాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్ల సహకారంతో విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలు తెలిపిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. అర్జీ స్వీకరించిన అనంతరం దానికి ఒక గ్రీవెన్స్ నెంబరు అందచేసి ఆ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఎంఎల్‌ఎ కార్యాలయ సిబ్బంది, అధికారులు, సచివాలయ సిబ్బంది బాధ్యత వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి రావుల లక్ష్మి, వైసిపి మండల కన్వీనర్ శంకర్ రెడ్డి, నాయకులు, రఘునాథ్ రెడ్డి, గృహ సారథుల కన్వీనర్ మల్లికార్జున రెడ్డి, సొసైటీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, చంద్రా రెడ్డి, దువ్వూరు సొసైటీ అధ్యక్షులు మధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










