ప్రజాశక్తి మైలవరం : మైలవరంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం సచివాలయం 5 పరిధిలో కొనసాగింది. ఈ సందర్భంగా శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.










