కడప ప్రతినిధి/కడప : జిల్లాలోని గడప గడపనూ క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. 20 రోజు లుగా ఇండియాలో ఐసిసి ఆధ్వర్యంలో క్రికెట్ ప్రపంచకప్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియా వరుసగా తొమ్మిది లీగ్ మ్యాచ్‌ల్లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. లీగ్ దశను దాటిని అనంతరం సెమీ ఫైనల్ మ్యా చ్‌లో విజయం సాధించిన జట్టు వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించాల్సి ఉంది. ముంబరులోని వాంఖడే స్టేడియంలో బుధవారం ఇండియా- న్యూజిల్యాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇండియాకు గట్టి ప్రత్యర్థిగా పేరు గడించిన న్యూజిల్యాండ్ సెమీ ఫైనల్‌లో ఢకొీనడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. యువతలో క్రికెట్ పట్ల ఎనలేని ఆసక్తి కలిగిన ఉన్న నేపథ్యంలో క్రికెట్ అభి మానుల అభిరుచికి అనుగుణంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ స్క్రీన్లు, నగరంలోని పలు కూడళ్లలో పోస్టర్లను ఏర్పాటు చేసి లైవ్‌మ్యాచ్‌ను తిలకించే ఏర్పాట్లు చేసింది.
ఆర్ట్ కళాశాల మైదానంలో సందడే సందడి
ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఇండియా న్యూజి ల్యాండ్‌ను ఢకొీంది. తొలుత ఇండియా బ్యాటింగ్ చేయడంతో ఇళ్లు, కార్యాల యాలు, ఆర్ట్స్ కళాశాల మైదానాలు అనే తేడా లేకుండా జిల్లా యువత టివిసెట్లకు అతుక్కుపోయింది. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇండియన్ బ్యాట్స్ మెన్స్ కొట్టే ఫోర్లు, సిక్స్‌లకు ఈలలు, కేకలతో ఆర్ట్స్ కళాశాల మైదానం ప్రతిధ్వనించడం విశేషం. ఇదే తర హాలో జిల్లాలోని గడప గడపలోని టెలివిజన్ సెట్ల దగ్గర జిల్లా యువత సందడి సందడిగా కనిపించింది.
బెట్టింగ్‌రాయుళ్లు అలర్ట్? : క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అలర్ట్ అయ్యారా అనిపిస్తోంది. మంగళవారం రాత్రి పులివెందుల టిడిపి ఇన్‌ఛార్జి బి.టెక్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ పంపించిన నేపథ్యం కారణమని తెలుస్తోంది. రాజకీయ పరమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఆధునిక యాప్‌లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు తన కార్యకలాపాలను సాగించకుండా ఉంటారనుకోవడం అత్యాశే అవుతుందనడంలో సందేహం లేదు.