ప్రజాశక్తి-పిచ్చాటూరు : శుక్రవారం ఉదయం పిచ్చా టూరు మండలములోని గోవర్ధనగిరి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, మాజీ ఎమ్మెల్సీ కందేరి జయచంద్ర నాయుడు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని ప్రజలు తమ పార్టీ సంక్షేమాలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కావున ప్రజలకు చేరువవుతున్నదా లేదా తెలుసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న గోరు ముద్దు ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం, జగనన్న కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ కిట్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టి సీబీఎస్ఈ సిలబస్ అందిస్తున్నాము. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది,డీబీటీ ద్వారా నవరత్నాలు, అమ్మ ఒడి అందుతున్నాయి.కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించాము రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు, త్వరలో సంచార పశు వైద్య క్లినిక్‌లు అందుబాటులోకి పంటకు మద్దతు ధర ప్రకటించి రైతన్నుకు అండగా ఉంటున్నాం, ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తున్నాం. ఆరోగ్య శ్రీ ద్వారా ప్రజలకు మేలైన వైద్యం కోసం17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం.గర్భిణిలు, బాలింతల ఆరోగ్య బాధ్యతలు తీసుకున్నాం.వైఎస్ఆర్ పింఛన్ కానుక ద్వారా రూ.2,750 ఇస్తున్నాం. 10 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం.కాపు నేస్తం , గౌతం రెడ్డి బ్యారేజీని జాతికి అంకిత .వైఎస్‌ఆర్ ఆసరా కింద పేద మహిళలకు ఏటా రూ.15వేలు చొప్పున సాయం,రాష్ట్రంలో శాంతిభద్రతలు.అమ్మ ఒడి ద్వారా పిల్లలకు లబ్ధి చేకూరింది.డిజిటల్ లెర్నింగ్ కోసం విద్యార్థులకు లక్షల ట్యాబ్‌లు అందించాం,మన బడి నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు.ప్రభుత్వ జూ. కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ హాస్టళ్ల అభివృద్ది చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










