Jul 22,2023 00:55

లబ్దిదారులతో మాట్లాడుతున్న బూడి

ప్రజాశక్తి-చీడికాడ: గడప గడపకు సంక్షేమ పథకాలు అందించడమే వైసిపి ప్రభుత్వం లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. మండలంలో అడవి అగ్రహారం గ్రామంలో శుక్రవారం గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించడమే తమ లక్ష్యమని, నాలుగేళ్లలో గడప గడపకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. స్థానికంగా సమస్యలను ప్రజలతోనే అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యకమంలో మండల వైసీపీ కన్వీనర్‌ గొల్లవిల్లి రాజుబాబు, యూత్‌ కన్వీనర్‌ స్వామి నాయుడు, సర్పంచ్‌ సలాది దనలక్ష్మి, గంగశేషు, పంచాయతీ కార్యదర్శి గోపి, వైసీపీ నాయుకులు గంటా మత్సరాజు సన్యాసిరావు, పరువాలు రామారావు, మహేష్‌, ఐసిడిఎస్‌ పిఓ శ్రీదేవి, హౌసింగ్‌ ఏఇ సూరిబాబు, విద్యుత్‌ ఏఇ వెంకట్రావు, వాలంటీర్లు పాల్గొన్నారు.
పాయకరావుపేట: కందిపూడి గ్రామంలో గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఇంటింటికీ వెెళ్లి సంక్షేమ పథకాలపై అడిగి తెలుసుకున్నారు. కందిపూడి గ్రామంలో అతి త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వ్యవసాయ సలహా అబివృద్ధి కమిటీ చైర్మన్‌ చిక్కాల రామారావు, ప్రచార పబ్లిక్‌ వింగ్‌ జిల్లా అధ్యక్షులు దగ్గుపల్లి సాయి బాబా, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు గుటూరు శ్రీనివాసరావు, జగత శ్రీను, పాయకరావుపేట పిఎసిఎస్‌ అధ్యక్షులు దేవవరపు రాజేష్‌ ఖన్నా, ఇసరపు తాతారావు పాల్గొన్నారు.