సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే ఫాల్గుణ
ప్రజాశక్తి హుకుంపేట:గడప గడప కార్యక్రమంలో గ్రామ సమస్యలు పట్టవా అని ప్రజలు వాపోతున్నారు. మండలంలోని పట్టం పంచాయతీ గ్రామంలో సోమవారం గడపగడప కార్యక్రమం నిర్వహించారు. అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణతో పాటుగా వైసిపి నేతలు పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకున్నారు. బురువాలస, నడుము విధి, అమనగిరి గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గిరిజనులు కోరారు. కోడితల గ్రామంలో రహదారి మరమ్మతుకు నోచుకోక ప్రమాదాలకు నిలయంగా మారిందన్నారు. అధికారులు, నాయకులు గ్రామాలకు వచ్చినప్పుడు సంక్షేమ పథకాలతో పాటు సమస్యలు కూడా తెలుసుకుంటే బాగుండేదని ప్రజలు సూచించారు.










