Sep 09,2023 00:43

ప్రజాశక్తి - భట్టిప్రోలు
ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ప్రజలకు దగ్గర అవడానికి ఎంతో బాగుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మెరుగు నాగార్జున అన్నారు. గ్రామంలో శుక్రవారం గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకు తిరగడం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి అవకాశం లభిస్తుందని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రతి ఇంటికి ఏదో రూపంలో సంక్షేమ పథకాలు అందజేసిందని అన్నారు. ఇంకా అందని అర్హులు ఉంటే వారికి కూడా వాలంటీర్ల ద్వారా అందజేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ధారా రవికిరణ్మయి, ఎంపీపీ డివి లలిత కుమారి, ఉప సర్పంచ్ బుర్లె రాంప్రసాద్, ఎంపీటీసీలు కె పిచ్చయ్యశాస్త్రి, గద్దె సుశీల, మాజీ ఎంపీటీసీ కౌతరపు విజయలక్ష్మి, నాయకులు కె శ్రీనివాసరావు, రెహమాన్, ఇస్మాయిల్ పాల్గొన్నారు.