Dec 14,2022 23:47

సంక్షేమ పథకాల బ్రోచర్‌ను అందిస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి

ప్రజాశక్తి -తగరపువలస : బోగ్గురోడ్డు -3 సచివాలయం పరిధిలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలనడిగి తెలుసుకున్నారు. విద్యా దీవెన, అందరికీ ఇళ్లు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ మేరకు అందుతున్నవీ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. వీధి దీపాలు వెలిగించాలని కొంతమంది స్థానికులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తిచేశారు. జివిఎంసి ఒకటో వార్డు కార్పొరేటర్‌ అక్కరమాని పద్మ, కోఆప్షన్‌ సభ్యులు కొప్పల ప్రభావతి, జోనల్‌ కమిషనర్‌ ఎస్‌ వెంకటరమణ, పిఎసిఎస్‌ అధ్యక్షులు అక్కరమాని రామునాయుడు, వైసిపి వార్డు అధ్యక్షులు జగ్గుపిళ్ల ప్రసాద్‌, మాజీ కౌన్సిలర్‌ కొప్పల రమేష్‌, నాయకులు పందిరి విజరు, అక్కరమాని చినబాబు, తమ్మిన అశోక్‌, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.