![](/sites/default/files/2023-11/kavali%20mla100_0.jpg)
ప్రచారం చేస్తున్న ఎంఎల్‌ఎ
గడప గడపకు మన ప్రభుత్వం
ప్రజాశక్తి-కావలి:ఉదయం నుంచి ఆగకుండా వర్షం పడుతున్నా కూడా లెక్క చేయక కావలిఎం.ఎల్.ఏ.రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి '' ''గడప గడపకు మనప్రభుత్వం'' కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయన గన్ మెన్ గొడుగు పడుతుండగా, మంగళవారం 7 వ వార్డులో గడప గడపకు తిరిగితున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అని విచారిస్తూ కార్యక్రమం చేస్తున్నారు. ''గడప గడపకు మన ప్రభుత్వం'' కార్యక్రమంలో భాగంగా190వ రోజు గత
4 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించిప్రజాసమస్య లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కావలి పట్టణ వైఎస్‌ఆర్సిపి నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, పొనుగోటి అనురాధ, తోట శ్రీహరి, జనిగర్ల మహేంద్ర యాదవ్, అమరా వేదగిరి సుబ్బారాయుడుగుప్తా,ఎర్ర వెంకయ్య పాల్గొన్నారు.