Aug 28,2023 18:45

మహిళలతో మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మహీధర్‌ రెడ్డి

ప్రజాశక్తి-గుడ్లూరు :రీ సర్వే చేసే సమయంలో తనకు రావాల్సిన 50 సెంట్లు పొలం ఇప్పించాలని గుడ్లూరు మండలం పరకంటిపాడులో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో సుబ్బరాయుడు అనే రైతు ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌రెడ్డి దష్టికి సోమవారం తీసుకొచ్చారు ఎంఎల్‌ఎ ఆధ్వర్యంలో గడప గడప మన ప్రభుత్వం సోమవారం జరిగింది ఎంఎల్‌ఎ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు ఉంటే తెలియజేయాలని గ్రామస్తుల్ని అడిగారు విరిగిపోయిన విద్యుత్తు స్తంభాలు స్థానంలో నూతన స్తంభాలు వేయాలని గ్రామస్తులు తెలిపారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ సక్రమంగా అందజేయాలని మౌలిక సమస్యలు పరిష్కారం చేయాలని ఎంఎల్‌ఎ అధికారులను ఆదేశించారు. తహశీల్దార్‌ సూర్య నారాయణ సింగ్‌, ఎంపిడిఒ, చంద్ర సేన్‌ ఉన్నారు.