గడప గడపకు మన ప్రభుత్వంలో నేదురుమల్లి
ప్రజాశక్తి -రాపూరు : మండలంలోని సంక్రాతిపల్లిలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. వెంకటగిరి సమన్వకర్త నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డికి గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. అర్హత ఉండి పథకాలు అందని లబ్ధి దారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ అధికారులు, జెడ్ పిటిసి, ఎంపిటిసిలు, సర్పంచులు, జెఎస్‌సి ఎస్ కన్వీనర్ దందోల్ నారాయణరెడ్డి, చెన్ను తిరుపాలురెడ్డి ఉన్నారు.










