మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
గడప గడపకు మన ప్రభుత్వం
ప్రజాశక్తి-కావలి:పట్టణంలోని 18వ వార్డులో బుధవారం ''గడపగడపకు వైసీపీ ప్రభుత్వం ''కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు.మహిళలు హారతులు ఇచ్చి,రామిరెడ్డికి స్వాగతం పలికారు.. వార్డు ప్రజలు ఎమ్మెల్యే రామిరెడ్డిని ఆప్యాయంగా పలకరిస్తూ , ఆయనకు వెన్ను దన్నుగా నిలబడ్డారు. అయన మళ్లీ3వ సారి ఎమ్మెల్యేగా గెలవాలని, మంత్రి పదవి సాధించాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కనమర్లపూడి వెంకటనారాయణ, సన్నిబోయిన ప్రసాద్,కుందుర్తిశ్రీనివాసులు, గంధంప్రసన్నాంజ నేయులు, పందిటి కామరాజు, అబ్దుల్ హమీద్,తదితరులు పాల్గొన్నారు.










