ప్రజాశక్తి- సంతమాగులూరు
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ కన్వీనర్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. మండలంలోని సజ్జాపురంలో 2వ రోజు గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమ నిర్వహించారు. గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న కుటుంబాలను కలిసి మాట్లాడారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనితీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలకు సిఎం వైఎస్ జగన్ లబ్ధి చేరుస్తున్నారని వివరించారు. నాయకులంతా కలసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రానున్న ఎన్నికలలో మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పిటిసి అడవి శ్రీనివాసరావు, వైసీపీ మండల కన్వీనర్ చింతా రామారావు, మాజీ ఎఎంసి చైర్మన్ బొల్లినేని రామకృష్ణ, నాయకులు తేలప్రోలు వెంకట్రావు, సర్పంచి అనంతవరపు మార్తమ్మ పాల్గొన్నారు.










