గద్దర్‌కు నివాళులర్పిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-కందుకూరు :ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ సంస్మరణ సభ శనివారం కందుకూరు అంబేద్కర్ విగ్రహ కూడలిలో జరిగింది. ముందుగా గద్దర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అరుణోదయ కళాకారులు , ప్రజానాట్యమండలి కళాకారులు, బహుజన కళాకారులు ఆటా పాటలతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో విమలక్క ఏపూరి సోమన్న, గండవరపుశేషయ్య ,కోడూరి నాంచార్లు గానాలాపన చేసారు. బి.వెంకటేశ్వర్లు, పాలేటికోటేశ్వరరావు, ముప్పవరపు కిషోర్, పేరం సత్యం, రావినూతల మోహన,్ డి.మాధవరావు, పొనుగోటిప్రభాకర్ ,బూసి సురేష్, షేక్ గౌస్ ఉపాల్గొన్నారు.










