ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : ప్రజా యుద్ధనౌకగా పేరొందిన ప్రముఖ రచయిత కళాకారులు గుమ్మడి విఠల్ రావు(గద్దర్)సంస్మరణ సభ స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం సాయం త్రం జరిగిం ది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి ప్రజా కళా కారులు, వాగ్గేయ కారులు, బహుజన సంఘాల ప్రతినిధులు పాల్గొని నివాళులర్పిం చారు. తొలుత గద్దర్ చిత్రపటానికి నివాళులర్పించారు. బహుజన రచయితల వేదిక, అభ్యుదయ రచయితల సంఘం, దళిత మహాసభ తదితర సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు చల్లపల్లి స్వరూపరాణి ప్రసంగిస్తూ జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదురొడ్డి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి అణగారిన వర్గాల ఉన్నతి కోసం పాటుపడ్డారని అన్నారు. తంగిరాల సోనీ (బహుజన రచయిత వేదిక), మోతుకూరి అరుణకుమార్ (అరసం) పేరురి మురళి కుమార్ ఎస్‌ఎస్‌సి బోస్ (పౌరహక్కుల సంఘం) మాట్లాడుతూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించిన గద్దర్ చివరి రోజుల్లో ఎన్నికలను సమర్థించా రని అన్నారు. కార్యక్రమంలో మల్లెల వెంకట్రావు, పంతగాని రమేష్ (ఎబిఎస్ పార్టీ), కష్ణ (దళిత మహాసభ) కొరబండి బాబురావు, ఆర్ పిచ్చయ్య, ఆండ్ర మాల్యాద్రి పాల్గొన్నారు.










