గద్దర్ చిత్రపటానికి ఘన నివాళి
ప్రజాశక్తి-కావలి : ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో డాక్టర్ గుండెమడుగుల దేవదానం మెమోరియల్ హాస్పిటల్‌లో ప్రముఖ వాగ్గేయ కారుడు గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర్ నాయుడు మాట్లాడుతూ గద్దర్ మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు. గద్దర్ త్యాగనిరతి సేవాతత్వం ఈనాటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రజల బాధలను జానపద పాటలుగా మార్చి ప్రజలను చైతన్య పరిచే వాడని అన్నారు. గద్దర్ పోరాట స్ఫూర్తిని, త్యాగపూరిత జీవితాన్ని, ప్రజలపై ఉన్న అంకితభావాన్ని బలంగా ముందుకు తీసుకుపోవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థల గౌరవాధ్యక్షులు ఖాదర్ బాషా, సామాజిక కార్యకర్త మాలకొండారెడ్డి, మాజీ కౌన్సిలర్ మస్తాన్, మాజీ విద్యార్థి నాయకుడు కరవది భాస్కర్, రాజ్‌న్యూస్ జిల్లా స్టాఫర్ చరిత్‌కుమార్, స్వచ్ఛంద సంస్థల నాయకురాలు ఎస్‌కె ఖాదర్‌బీ, హాస్పిటల్ పిఆర్‌ఒ ఆనంద్, పాత్రికేయులు చిలకపాటి మధుబాబు, చిలకపాటి మనోహర్, బత్తిన మనోహర్, కందవరపు సురేష్, భీమవరపు బాలాజీ, సిఎం రమేష్ తదితరులున్నారు.










