May 19,2023 19:47

రౌడూరులో దగ్ధమైన గడ్డివాములు

ప్రజాశక్తి - కౌతాళం
మండలంలోని రౌడూరు గ్రామంలో నాలుగు గడ్డివాములు దగ్ధమై, సుమారు రూ.లక్ష ఆర్థిక నష్టం సంభవించింది. గ్రామస్తుల వివరాల మేరకు... శుక్రవారం మధ్యాహ్నం మండుటెండల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గ్రామస్తులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గ్రామానికి చెందిన మాల హనుమంతప్ప, మాల ఈరన్నకు చెందిన నాలుగు గడ్డివాములు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై బూడిదయ్యాయి. ఆదోని పట్టణం నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి అదుపు చేసింది.