దగ్ధమవుతున్న గడ్డివామి
ప్రజాశక్తి - పెద్దకడబూరు
మండలంలోని చిన్నతుంబలం గ్రామంలో గడ్డివామి దగ్ధమైంది. రూ.90 వేల ఆస్తినష్టం సంభవించింది. గ్రామానికి చెందిన రైతు హరిజన బొడ్డన్న మూడు రోజుల క్రితం ఐదెకరాల ఎండు గడ్డిని రూ.50 వేలకు, రెండెకరాల బుడ్డల పొట్టును రూ.25 వేలకు, మొత్తం దాదాపు రూ.90 వేలతో ఎద్దులకు, ఆవులకు పశుగ్రాసం కొనుగోలు చేసి పశువులకు అందుబాటులో ఉంచుకున్నారు. మంగళవారం అది ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఫైర్ ఇంజిన్ సహాయంతో, గ్రామస్తుల సహకారంతో దాదాపు రెండు గంటల సేపు కృషి చేసి మంటలను ఆర్పివేశారు.










