Oct 09,2023 23:39

ప్రజాశక్తి - పర్చూరు
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని నూతలపాడు పంచాయితీకి గడ్డి, కలుపు, నాచు కత్తిరించే మిషన్‌ను క్లబ్ అధ్యక్షుడు నాగబైరు శ్రీనివాసరావు చేతుల మీదుగా సెక్రెటరీ బీమినేని హరిప్రసాద్‌కు అందచేశారు. ఈ సందర్భంగా పంచాయితీ సెక్రటరీ మాట్లాడుతూ నూతలపాడు గ్రామ అవసరములకు అడిగిన వెంటనే వనరులు, వస్తువులు సమకూరుస్తున్న రోటరీ క్లబ్ ప్రతినిధులకు ధన్య వాదంలు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి పంబి సదానందరెడ్డి, సభ్యులు భవనం రాజగోపాలరెడ్డి, పాబోలు వెంకన్న, కారుముడి సుబ్బారెడ్డి, ఉప సర్పంచ్ వనుకూరి బ్రహ్మరెడ్డి పాల్గొన్నారు.