ఆర్థిక సాయం అందజేస్తున్న ప్రదీప్‌రెడ్డి
ప్రజాశక్తి - మంత్రాలయం
మండలంలోని రచ్చమర్రి గ్రామానికి చెందిన సుంకేశ్వరి, ముక్కరన్నకు చెందిన గడ్డి వాములు దగ్ధమయ్యాయి. రైతుకు నష్టం వాటిల్లడంతో వైసిపి రాష్ట్ర యువనేత వై.ప్రదీప్ రెడ్డి రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. గత వారం రోజుల క్రితం ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగి పడి మంటలు చెలరేగి గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు యువనేత చేయూతనందించారు. శనివారం ఎమ్మిగనూరు పట్టణంలోని భీమా నిలయంలో గ్రామ నాయకులతో కలిసి నగదు అందజేశారు. మాజీ వైస్ ఎంపిపి వెంకోబా, నాయకులు రోగప్ప, రవి రెడ్డి, బొజ్జప్ప, నారాయణ, డీలర్ బొజ్జప్ప, వీరన్న గౌడ్, నరసప్ప పాల్గొన్నారు.










