గడ్డి వాములను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
గడ్డి వాములు దగ్ధం
- రూ.లక్ష ఆస్తి నష్టం
ప్రజాశక్తి - పాములపాడు
మండలంలోని మద్దూరు మజార గ్రామం కృష్ణానగర్ గ్రామంలో రైతు ఎస్ షబ్బీర్‌ు చెందిన రెండు గడ్డివాములు సోమవారం దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆత్మకూరు ఫైర్ స్టేషన్ కు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. సుమారు రైతుకు లక్ష రూపాయలు నష్టం వాటిలినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఒక ఎద్దు, ఒక ఆవులకు గాయాలు అయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వలన జరిగి ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. ఫైర్ సిబ్బంది ఎస్‌ఎఫ్‌ఓ భీముడు నాయక్, ఎల్ ఎఫ్ కరిముల్లా, డ్రైవర్ ఎస్‌ఎండీ గౌస్, ఫైర్‌మెన్లు శ్రీనివాసులు, ఇమామ్ ఖాసిం, ఎస్ వి నరసింహ స్వామి పాల్గొన్నారు.










