
పీలేరు : వైసిపి వర్గీయుల దాడిలో గాయపడిన జన సైనికులను ఆ పార్టీ నాయకులు పరామర్శించారు. పలమనేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జనసే పార్టీ నాయకుడు మధుబాబు, అతని కుటుంబ సభ్యులను సోమవారం జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కలపరవి, పీలేరు నియోజకవర్గం ఇన్‌ఛార్జి బెజవాడ దినేష్‌కుమార్ కలసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలమనేరులో వైసిసి గడప గడపకు కార్యక్రమంలో భాగంగా జనసేన మండల ప్రధాన కార్యదర్శి మధుబాబు ఇంటి దగ్గరకు వచ్చిన వెంకటేష్‌గౌడ్‌ను ఈ ప్రభుత్వంలో తనకు ఇల్లు ఇచ్చామన్నారని, ఆ జాగా ఎక్కడుందో తనకు చూపమని నిలదీసిన పాపానికి అతని కుటుంబ సభ్యులను కొట్టి గాయపరచడం దారుణమన్నారు. జన సైనికులపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు రవి, పీలేరు మండల అధ్యక్షుడు మోహన్ కష్ణ, మండల ప్రధాన కార్యదర్శి గజేంద్ర, హరీష్ పాల్గొన్నారు.