Oct 02,2023 20:11

గాంధీకి నివాళి అర్పిస్తున్న ఎన్‌సిసి విద్యార్థులు

ప్రజాశక్తి-కందుకూరు : ప్రకాశం ఇంజినీరింగ్‌ కాలేజీ ఎన్‌సిసి యూనిట్‌ గాంధీ జయంతిని పురస్కరించుకొని కందుకూరు ఎంఅర్‌ఒ కార్యాలయానికి వెళ్లి నివాళులర్పించారు. అనతి కాలంలో 34ఎ బెటాలియన్‌లో పలుకార్యక్రమాల్లో అగ్రభాగాన నిలిచి అధికారులతో ప్రశంసలందుకుంటున్న తమ కాలేజీ యూనిట్‌ బాపూజీ విగ్రహానికి పూలమాల సమర్పించి స్మరించుకోవడం మరో వినూత్న కార్యక్రమానికి తెర తీసినట్లుయిందని కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల స్ఫూర్తిని ఎన్‌సిసి ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజీ పర్యవేక్షకులు ఎస్‌.ఎన్‌. మీరావలి అభినందించారు. మూడేళ్ల స్థాపనలో ఫైరింగ్‌, మార్చ్‌ ఫాస్ట్‌, ఇతర పోటీలలో తమ యూనిట్‌ కాలేజీ ప్రతిష్టను పెంచడం ఊహాతీతమని టెక్నికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.విజయ శ్రీనివాస్‌ హర్ష వ్యక్తం చేశారు. సీనియర్‌ కాడెట్స్‌ సునీల్‌,సతీష్‌, శ్రీనివాస్‌ జూనియర్స్‌ ఫకీరయ్య,లిఖిత్‌, నరేంద్ర పాల్గొన్నారు.