ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : గాంధీజీ స్ఫూర్తిగా కొత్త సంకల్పం తీసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని మున్సిపల్ కార్యాల యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి కలెక్టర్ పూల మాలలేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత జాతికి మహాత్మా గాంధీజీ గొప్ప స్ఫూర్తి ప్రదాత అన్నారు. అహింసాయుత పద్ధతిలో ఎన్నో ఉద్యమాలకు మార్గదర్శ కత్వం చేశారని, ఆయన అహింసా మార్గం యావత్ ప్రపంచానికి గొప్ప మార్గాన్ని చూపిందని, కొనియాడారు. లాల్ బహదూర్ శాస్త్రి గొప్ప పరిపాలనా దక్షులన్నారు. నైతిక విలువలకు మారు పేరుగా నిలిచారని చెప్పారు. జై జవాన్, జై కిసాన్ అంటూ పిలుపునిచ్చి గొప్ప ప్రేరణ కల్పించారని అన్నారు. కార్యక్రమంలో జెసి ా్యంప్రసాద్, ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, డిఆర్‌ఒ వినాయకం పాల్గొన్నారు.
గురుకుల విద్యార్థినులకు క్రీడా దుస్తులు పంపిణీ
గాంధీ జయంతి సందర్భంగా నరసరావుపేటలోని ఏ.పీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో బాలికలకు ఎన్‌ఇసి విద్యాసంస్థలు, పుడా చైర్మన్ మిట్టపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా అభిమానులు అందజేసిన నోటు పుస్తకాలు పెన్నులు, పెన్సిల్లును వైసిపి నాయకులచే పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. జిల్లా పెన్షన్స్ అసోసియేషన్ సంఘ భవనంలో గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి నిర్వహించారు. అధ్యక్షులు ఎం.సుబ్బా రావు, గౌరవాధ్యక్షులు జి.అప్పిరెడ్డి, కార్యదర్శి సిసి ఆదేయ్య, కోశాధికారి జి.రాఘవయ్య, జాయింట్ సెక్రెటరీ పి.నాగభూషణం, సభ్యుల ఎ.వెంకటేశ్వర్లు ,షేక్ హుస్సేన్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - రొంపిచర్ల : మండలంలోని పాఠశాలలు, సచివాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీ జయంతి నిర్వహించారు. తహశీల్దార్ కార్యాల యంలో చిత్రపటానికి తహశీల్దార్ జి.అంకారావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలు చోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో డిప్యూటీ తహశీల్దార్ బాల వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్ మాదిరాజు చంద్రశేఖర్, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ గెల్లి సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ పడాల చక్రారెడ్డి, వైసిపి యువజన విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు పడాల శివారెడ్డి, బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఎస్.తిమ్మరాజు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్
మహాత్మా గాంధీ చూపిన మార్గాన్ని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చైతన్య భారతి ఆధ్యర్యంలో గాందీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. సబ్ జైలు వద్ద ఉన్న గాందీ విగ్రహానికి, సాయిబాబా దేవాలయం వద్ద వున్న లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పూలమాలలు వేశారు. రోటరీ క్లబ్, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. గాంధీ బొమ్మలు సెంటర్లో వున్న విగ్రహానికి పూలమాలలేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఎం.వెంకటేశ్వరరావు గాంధీ విగ్రహానికి పూలమాలవేశాఉ. తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సురేష్ నివాళులర్పించారు. జనసేన నాయకులు బి.వెంకట అప్పారావు నివాళులర్పించారు.
ప్రజాశక్తి - సత్తెనపల్లి టౌన్ : పారిశుధ్య కార్మికులు నిజమైన సేవకులుని జై భీం భారత్ పార్టీ నాయకులు జె.విజరు కుమార్ అన్నారు. గాంధీ జయంతినీ పురస్కరించుకొని ఆ పార్టీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులను సన్మానించారు. జె.కమల్ కుమార్, ఎం.వెంకట్రావు, ఎం.దేవారాజ్, డి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - వినుకొండ : స్థానిక వెన్నపూస కాలనీలోని గీతమ్స్ ఇంగ్లీష్ మీడియం క్యాంపస్‌లో నివాళులర్పించగా విద్యాసంస్థల కరస్పాండెంట్ ఎం.కోటిరెడ్డి మాట్లాడారు. ప్రిన్సిపల్ ఎం.కృష్ణవేణి, ఉపాధ్యాయులు , విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయవాదుల భవనం వద్ద గాంధీ జయంతి నిర్వహించగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ వీరాంజనేయ చౌదరి మాట్లాడారు. ఎంఎన్ ప్రసాద్, పీజే లూకా, జి.సురేష్, ఎలేషాబాబు, అశోక్‌బాబు, బ్రహ్మం, డి.విజరు, శేఖర్‌బాబు, డి.నాగరాజు, జి.హరిప్రసాద్, ఆంజనేయులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలేసి నివాళులు అర్పించారు. పివి సురేష్‌బాబు, పి.కృష్ణ, కరిముల్లా, సుభాని, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - బెల్లంకొండ : మండల కేంద్రమైన బెల్లంకొండలో గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు సిపిఎం మండల కార్యదర్శి సిహెచ్ పుల్లారావు, నాయకులు సైదయ్య, దుర్గారావు, లింగయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. పుల్లారావు మట్లాడు తూ దేశంలో ఇప్పటికీ 40 శాతం మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని, 30 శాతం మంది మూడు పూటల ఆహారానికి నోచుకోలేదని అన్నారు. ఈ పరిస్థితులను మార్చడంతోపాటు ప్రజల మధ్య మత సామరస్యం నెలకొల్పాలని. అదే గాంధీకి నిజమైన నివాళి అని చెప్పారు.
ప్రజాశక్తి - చిలకలూరిపేట : పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహనికి పలువురు పూలమాలలేసి నివాళులర్పించారు. జాతీయ బీ.సి సంక్షేమ సంఘం ప్రధాన కార్యాలయంలో లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో వివిధ సంఘాల నాయకులు బి.శ్రీను నాయక్, బి.చిన్న నాయక్, పి.శ్రీనివాసరావు, పి.శివశ్రీను, డి.డేవిడ్, బి.రాంబాబు నాయక్, కె.నాగేశ్వరరావు, ఎం.పృథ్వీ సాయి, కె.నాగేశ్వరరావు, ఆర్.వెంకట్, వెంకట బుల్లోడు, తేజ, టి.వెంకట నాగేష్, నాగరాజు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మాచర్ల : అంబేెద్కర్ సెంటర్ సమీపంలోని గాంధీ విగ్రహనికి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అహింసే ఆయుధంగా ఆయన చేపట్టిన స్వాతంత్య్ర పోరాటాన్ని అందరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. చంద్రబాబు ఆరెస్టును వ్యతిరేకిస్తూ గాంధీ విగ్రహనికి టిడిపి నాయకులు వినతిపత్రాన్ని ఇచ్చారు. పలు చోట్ల నివాళులర్పించిన వారిలో మున్సిపల్ చైర్మన్ ఎం.చినఏసోబు, వైస్ చైర్మన్ పి.నరసింహారావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కె.సాయిమార్కొండారెడ్డి, ఒ.చెన్నకేశ వరావు, ఎం.వెంకటలక్ష్మీ, డాక్టరు రామచం ద్రారెడ్డి, కె.వెంకటేశ్వర్లు, జి.నాసరయ్య, పి.హరి, జి.సాంబశివరావు, జి.నాగేశ్వ రరావు, పి.శ్రీనివాసరావు, బి.రఘురా మిరెడ్డి, ఎం.శ్రీనివాసశర్మ, బి.శ్రీనివాస రావు, కె.వెంకటబ్రహ్మారావు, కె.అనిల్‌కు మార్, వి.సుందరరావు, సత్యనారాయణ, శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, శివారెడ్డి, ఆంజయ్య, సైదారావు, శ్రీను, వజ్రం నాయక్, కృష్ణవేణి, ధనలక్ష్మీ, సామ్రాజ్యం, విజయ పాల్గొన్నారు.










