Apr 25,2023 00:49

అవార్డులు అందజేసి... ఉత్తమ సర్పంచ్‌లతో కలెక్టర్‌ కృతికా శుక్లా




ప్రజాశక్తి - యంత్రాంగం
పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా సోమవారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన ఉత్తమ జిల్లా స్థాయి, మండల స్థాయి గ్రామ సర్పంచ్‌లను ఘనంగా సత్కరించి, అవార్డులు ప్రధానం చేశారు. జడ్‌పి కార్యాలయంలో, మండల పరిషత్‌ కార్యాలయాల్లో సభలు నిర్వహించి వివిధ అంశాల వారీగా ఎంపిక చేసిన ఉత్తమ సర్పంచ్‌లను సత్కరించారు.
కాకినాడ జిల్లా పరిషత్‌ సమావేశ హాలులో జిల్లా కలెర్టక్‌ కృతికా శుక్లా ముఖ్య అతిథిగా జిల్లాలో వివిధ సుస్థిరాభివద్ది లక్ష్యాల సాధనలో ఉత్తమ ఫలితాలను సాధించి గ్రామ పంచాయితీల సర్పంచ్‌ లను సత్కరించారు. సుస్థిరాభివద్ది లక్ష్యాల సాధన ద్వారా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య ఆశయ సాకా రానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా సర్పంచ్‌లు, ఆధికారులను కోరారు. 1993లో 73వ రాజ్యాంగ సవరణ తెచ్చిన ఏప్రియల్‌ 24వ తేదీని ఏటా జాతీయ పంచాయితీ రాజ్‌ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. తొలుత జిల్లా కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలతో వేడుకలను ప్రారంభించి, జాతిపిత గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు అలంకరించారు. కార్యక్రమంలో వివిధ సుస్థిరాభివద్ది లక్ష్యాల సాధనలో జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించిన 11 పంచాయతీల సర్పంచులను జిల్లా కలెక్టర్‌, జిల్లా అధికారులు ఘనంగా సత్కరించారు. అంశాల వారీగా పేదరిక నిర్మూలన, సుస్థిర జీవనోపాధులు అంశంలో యు.కొత్త పల్లి మండలం గోర్స గ్రామం, సుపరిపాలన కాకినాడ రూరల్‌ మండలం కొవ్వాడ, కొవ్వూరు.. ఆరోగ్య పంచాయతీలో తుని మండలం రాజుపేట, ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు, చైల్డ్‌ ఫ్రెండ్లీ పంచాయతీలో యూ.కొత్తపల్లి మండలం రమణక్కపేట, తొండంగి మండలం పైడికొండ, తాగునీటి సమృద్ధిలో కరప మండలం పెనుగుదురు, పచ్చదనం, పరిశుభ్రం అంశంలో కొటనందూరు మండలం బిళ్లనందూరు, తుని మండలం కె.ఓ.మల్లవరం, మౌలిక వసతుల స్వయం సమృద్ధిలో కాకినాడ రూరల్‌ మండలం కొవ్వూరు, కరప మండలం పెనుగుదరు, సాంఘిక భద్రతలో కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురం ఎంపికయ్యాయి. కార్యక్రమంలో ఎంఎల్‌సి చిక్కాల రామచంద్రరావు, జడ్‌పి సిఇఒ ఎన్‌.వి.వి.సత్యన్నారాయణ, డిపిఒ ఆర్‌.విక్టర్‌, డిఆర్‌డిఎ పీడీ శ్రీరమణి, ఐసిడిఎస్‌ పీడీ ప్రవీణ, జడ్‌పి డిప్యూటీ సిఇఒ ఎవి రమణారెడ్డి, డివిజనల్‌ అభివృద్ది అధికారులు పి.నారాయణమూర్తి, కెఎన్‌వి ప్రసాద్‌, ఎంపిడిఒలు, సర్పంచ్‌లు, ఇఒపిఆర్‌డిలు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు మండలంలో ఎంపికైన మూడు గ్రామాలలో ప్రథమ స్థానం పెదబ్రహ్మదేవం, ద్వితీయ స్థానం గోంచాల. తతీయ స్థానం హుస్సేన్‌ పురం గ్రామాల సర్పంచులు నీలపాల సత్య నారాయణ, చోడిశెట్టి వెంకటరమణ, మార్ని నాగమణి, ఆయా గ్రామాల కార్యదర్శులను దుశ్శాలువాలతో సత్కరించి అవార్డులు బహుకరించారు ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, ట్రైనీ కలెక్టర్‌ ప్రకార్‌ జైన్‌, ఎపిడిఒ డి.శ్రీ లలిత, తహశీల్దార్‌ లక్ష్మీ నరసకుమారి, తదితరులు పాల్గొన్నారు. యు.కొత్తపల్లి మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి కారే సుధా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వాకతిప్ప, మూలపేట పంచాయతీలు ఎంపిక కాగా జిల్లా స్థాయిలో గోర్స, రవణక్క పేట పంచాయతీలు ఎంపిక కావడంతో ఆయా పంచాయతీల సర్పంచులకు అధికారులు నాయకులు దుశ్శాలువాలతో సన్మా నించి, అవార్డులను అందజేశారు. పెద్దాపురం మండల పరిషత్‌ కార్యాలయంలో చదలాడ, చిన్న బ్రహ్మదేవం,దివిలి,జే తిమ్మాపురం, కొండపల్లి, మరలావా, పులిమేరు, రాయ భూపాలపట్నం, ఆర్‌బి కొత్తూరు, సిరివాడ,తాటిపర్తి పంచాయతీల సర్పంచ్‌లకు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు ధ్రువపత్రాలు, జ్ఞాపికలు పంపిణీ చేశారు. అనంతరం ఆయా గ్రామాలకు పాగింగ్‌ మిషన్లను పంపిణీ చేశారు. ఎంపిపి పెంకే సత్యవతి ఎండిఒ కరక హిమ మహేశ్వరి, వైస్‌ ఎంపిపి మిరియాల రాజ పాల్గొన్నారు. తాళ్లరేవు మండలంలో ఉన్న 17 పంచాయతీలకు గాను 12 పంచాయతీలకు అవార్డులు రావడంపై ఎంపీపీ రాయుడు సునీత హర్షం వ్యక్తం చేశారు. అత్యధిక అవార్డులు సాధించిన కోరంగి, మరో 11 పంచాయతీలను సర్పంచులను, పాలకవర్గ సభ్యులను, ఎంపిటిసిలను, కార్యదర్శులను ఆమె సత్కరించి ఆయా విభాగాల వారీగా సర్టిఫికెట్లు అందజేశారు. ఎంపిడిఒ అనుపమ, ఇఒపిఆర్‌డి మల్లాడి భైరవమూర్తి, జడ్‌పిటిసి దొమ్మేటి సామ్యూల్‌ సాగర్‌, దున్న జనార్దన్‌ రావు, కుడుపూడి శివన్నారాయణ, ధూళిపూడి బాబీ, కొపనాతి నాగరాజు పాల్గొన్నారు. కరప మండల కార్యాలయంలో ఎంపిపి పెంకే శ్రీలక్ష్మీ సత్తిబాబు పెనుగుదురు, వేళంగి, విజయ రాయుడుపాలెం, పాతర్లగడ్డ, పెదకొత్తూరు, వాకాడ, పెద్దాపుర పాడు, కూరాడ, గ్రామాల సర్పంచ్‌లకు అవార్డులకు అందజేశారు. ఎంపీడీవో కే స్వప్న, తహశీల్దార్‌ పి శ్రీనివాసరావు పాల్గొన్నారు. గండేపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి చలగళ్ళ దొరబాబు మండల పరిధిలో 10 పంచాయతీలు సర్పంచులకు అవార్దులు అందజేశారు. ఎంపిడిఒ వెంకటరామన్‌, జడ్‌పిటిసి పరిమి వెంకటలక్ష్మి మంగతాయారు బాబు, వైస్‌ ఎంపిపి బిట్రా వెంకటలక్ష్మి రమణ పాల్గొన్నారు.