Oct 02,2023 22:42

విజయవాడ సిపి కార్యాలయంలో...

ప్రజాశక్తి - విజయవాడ : జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు నగర పోలీస్‌ కమీషనర్‌ వారి కార్యాలయంలో సోమవారం ఘనంగా జరిగాయి. ముందుగా నగర పోలీస్‌ కమీషనర్‌ కాంతి రాణా టాటా, డిసిపి విశాల్‌గున్ని మహాత్మా గాంధీ , లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సి.పి మాట్లాడుతూ...గాంధీజి, లాల్‌బహుదూర్‌శాస్త్రి వంటి వారి ఆలోచనలు, సంస్కరణలు మన అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. వన్‌టౌన్‌ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో మహామండపం 6వ అంతస్తులో 154వ గాంధీ జయంతి కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహనాధికారి దర్భముళ్ల భ్రమరాంబ పాల్గొని మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కెవిఎస్‌ కోటేశ్వరరావు, లింగం రమాదేవి, వైదిక సిబ్బంది, సహాయ కార్యనిర్వాహనాధికారి వార్లు, పర్యవేక్షకులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ జీవితం ప్రపంచానికి ఆదర్శప్రాయమని గాంధీ దీక్షల వ్యవస్థాపకులు, మహాత్మాగాంధీ దేవాలయం వ్యవస్థాపకులు, ఇండియన్‌ సివిలైజేషన్‌ గాంధీ ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షులు రాంపిళ్ళ జయప్రకాష్‌ కొనియాడారు. సోమవారం పాలఫ్యాక్టరీ వద్ద ఉన్న సయ్యద్‌ అప్పలస్వామి కళాశాల ప్రాంగణంలోని మహాత్మాగాంధీ దేవాలయంలో ఇండియన్‌ సివిలైజేషన్‌ గాంధీ ట్రస్ట్‌ డైరెక్టర్‌లు తమ్మిన సోనియా, తమ్మిన హనుమ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు గాంధీ దీక్షల విరమణ కార్యక్రమం జరిగింది. గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముని విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గాంధీ దీక్షను స్వీకరించిన పలువురు విద్యార్థిని విద్యార్థులు రాంపిళ్ళ జయప్రకాష్‌ సమక్షంలో ఉప్పులూరి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా గాంధీ దీక్షల విరమణ చేశారు. ఈ సందర్భంగా గాంధీ అష్టపంచ దశోత్తర పంచశతి నామావళి మినీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వ మానవాళి శ్రేయస్సును కోరుతూ గాంధీ హాోమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో సయ్యద్‌ అప్పలస్వామి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ అజ్మీరా రాంపండు నాయక్‌, ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమీ సెక్రటరీ గోళ్ళ నారాయణరావు, నగర ప్రముఖులు ముక్కామల పెద్దబాబు, కోడూరి రామ్మోహనరావు, పలువురు కళాశాల విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నందిగామ : నందిగామ పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు తాటి శివ కృష్ణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో భారత జాతిపిత మహాత్మా గాంధీజీ, భారత స్వాతంత్య్ర సమర యోధుడు, భారత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జన్మదిన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నియోజకర్గ నాయకులు కామిసెట్టి వెంకటేశ్వర రావు, పూజారి రాజేష్‌, వీర మహిళా విభాగం నాయకురాలు మేకపోతుల లక్ష్మి యాదవ్‌, పాముల పాటి వెంకట తులసి, వీరులపాడు మండల అధ్యక్షులు బేతపూడి జయరాజు, ఉపాధ్యక్షులు సింగంసెట్టి శ్రీనివాస్‌, కొమ్మవరపు నరసింహ స్వామీ,వెంకట్‌, ఆదిలక్ష్మీ, వెంకట నరసమ్మ, చిరంజీవి, శివకోటి పలువురు ఘన నివాళి అర్పించారు. నందిగామ పట్టణంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలను, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు శాసనసభ్యులు డాక్టర్‌ మొండితోక జగన్‌ మోహన్‌రావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గాంధీ సెంటర్‌లో ధ్యానముద్రలో ఉన్న బాపూజీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నందిగామ పట్టణం లోని రైతు పేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు తెదేపా శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్‌ పరిశీలనకు విచ్చేసి జాతిపిత మహాత్మా గాంధీజీ కి శాసనమండలి సభ్యులు మొండితోక అరుణ్‌ కుమార్‌ నివాళులర్పించారు. మైలవరం : మైలవరంలో నూజివీడు రోడ్డులోని గాంధీ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండల పరిషత్‌ కార్యాలయంలో గాంధీజీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. విజయవాడ:ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కష్ణాజిల్లా గ్రంధాలయ సంస్థ చైర్‌ పర్సన్‌ తిప్పరమల్లి జమల పూర్ణమ్మ, ముఖ్య అతిథిగా విచ్చేసి, గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల అర్పించారు. అనంతరం విద్యార్థులు గాంధీజీ గురించి చదివి వినిపించారు. దేశ భక్తి గీతాలు ఆలపించారు, దేశభక్తి గేయాలకు నత్యాలు చేశారు. అనంతరం చిత్ర లేఖనం, వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారి కె.రమాదేవి, విద్యార్థులు పాల్గొన్నారు. రామ్మోహన్‌ గ్రంథాలయంలో నిర్వహించిన గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి ఉత్సవాల్లో గ్రంథాలయ అధ్యక్షులు చింతలపూడి కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు, దమ్మాల రామచంద్ర రావు, కార్యదర్శి శ్రీ వేములపల్లి కేశవరావు, గ్రంధాలయ కమిటీ సభ్యులు, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్త రంజన్‌ గ్రేడ్‌-2 శాఖ గ్రంథాలయంలో చిన్నారులకు 'మహాత్మా గాంధీజీ సూక్తులు'' అను అంశంపై ''వక్తత్వ'' పోటీ నిర్వహించారు. చిత్ర లేఖనం, దేశ భక్తి గీతాలు, తదితర పోటీలలో విజేతలకు ప్రోత్సాహక బహుమతులు గ్రంథాలయ అథికారి పి.సంపత్‌ కుమార్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, గ్రంథాలయ సిబ్బంది, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు. కంచికచర్ల : జాతి పిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు సోమవారం కంచికచర్ల మండలంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాంధీజీ చిత్ర పటానికి గ్రామ సర్పంచ్‌ వేల్పుల సునీత, పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో స్వచ్చత హీ సేవా కార్యక్రమం లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ సభ నిర్వహించారు. .గంపలగూడెం: స్థానిక మండల కాంగ్రెస్‌ కార్యాలయంలో సోమవారం ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఎడ్లపల్లి రామకష్ణ తెలిపారు.మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమ్మిరెడ్డిగూడెం మాజీ సర్పంచ్‌ తమ్మారపు ఆదినారాయణ, వేల్పుల పాపమ్మ, మరీదు నవనీతం, మోదుగు లక్ష్మణరావు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.ఇది ఇలా ఉంటే స్థానిక మండల పరిషత్‌ నందు ఎంపీడీవో వైపి రెడ్డి, తోపాటు పలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. జగ్గయ్యపేట : మున్సిపల్‌ కార్యాలయం నందు మహాత్మా గాంధీ మరియు లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతుల సందర్భంగా వారి విగ్రహాలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వవిప్‌, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.