పలుచోట్ల వర్థంతి సభలు
ప్రజాశక్తి - జీలుగుమిల్లి
మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గెడ్డం ఎలీషా ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ కెఎం.మంగతాయారు ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఒలు, ఎంపిడిఒ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
చింతలపూడి :పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మహాత్మా గాంధీ వర్థంతి కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు మాటూరి చక్రధరరావు అధ్యక్షతన నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయానంద్ మాస్టార్ గాంధీ ఆశయాలను ప్రబోధించే పాటను చక్కగా ఆలపించారు. సుజాత టీచర్ చక్కటి సందేశాత్మక కవితను వినిపించారు. విద్యార్థులు గాంధీ జీవిత చరిత్ర వివరించారు.
దెందులూరు : దేశ చరిత్రలో మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయమని మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ఎబివిపి.లక్ష్మి అన్నారు. మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఎంపిడిఒ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొవ్వలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శర్మ ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పలు చోట్ల గాంధీ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు.
నూజివీడు : నూజివీడు నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో గాంధీ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంఎల్‌ఎ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, నూజివీడు నియోజకవర్గ పరిశీలకులు బొడ్డు వేణుగోపాలరావు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం నేడు రాష్ట్రంలో ఫ్యాక్షన్ నాయకుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. ప్రజా రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలు ఒక పార్టీకి ప్రయివేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటిడిపి నియోజకవర్గ అధ్యక్షులు గాజుల రాజేష్, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తట్టి అచ్యుత్, నియోజకవర్గ అధ్యక్షులు శివనాగరాజు పాల్గొన్నారు.
ముసునూరు : మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ వర్థంతి సభను ఎంపిడిఒ జి.రాణి, ఇఒపిఆర్‌డి బసవరాజు అచ్యుత సత్యనారాయణ, ఎఒ బసవరాజు, కూచిపూడి సాయిరాము నిర్వహించారు. మండలంలోని లోపూడి ఆశ్చర్య పాఠశాలలో జెడ్‌పిటిసి సభ్యులు వరికూటి ప్రతాప్, ముసునూరు మండపం సెంటర్‌లో గ్రామస్తుల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.










