Nov 07,2023 22:09

ఓబుళదేవరచెరువులో నేలకొరిగిన వరిపంట

ప్రజాశక్తి - ఓబుళదేవరచెరువు : సోమవారం రాత్రి కురిసిన గాలివానకు మండలంలో పలుచోట్ల వరి పంట నేలకొరిగింది. మండలంలోని వెంకటాపురం, నారప్ప గారి పల్లి తదితర గ్రామాలకు చెందిన వరిపంట నేలకొరిగింది. దీంతో రూ 7లక్షలు నష్టం వాటిలిలందని ఆయా గ్రామాలకు చెందిన రైతులు వాపోయారు. నారప్ప గారి పల్లి చెందిన రాజారెడ్డి, గంగప్ప, వెంకట, మల్‌రెడ్డి తోపాటు వెంకటాపురం చెందిన రెడ్డప్ప నాయుడు, నాగమునినాయుడు, మునీంద్ర, శ్రీరామ నాయుడు కు చెందిన 10 కకరాల్లో వరి పంట నేలకొరిగింది. దీంతో తమకు రూ. 7 లక్షలు నష్టం వాటిల్లని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
రొద్దం : మండలంలోని కురిసిన భారీ వర్షానికి కలిపి, శేషాపురం, బూదిపల్లి తదితర గ్రామాల్లో అపార పంటనష్టం జరిగింది. వరి పంటలు పూర్తిగా నేలకు ఒరిగిపోయాయని రైతులు వాపోయారు. కలిపి, శేషాపురం, బూదిపల్లి గ్రామాలలోని దాదాపు 500 ఎకరాల మేర వరి పంట నేలకొరిగింది. మండల వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం వరి పంటలు ఎంతో ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఆనందపడ్డారు. అయితే వర్షానికి వరి పంటకు నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉన్నతాధికారులు పరిశీలించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఎంపీపీ చంద్రశేఖర్‌ నష్టపోయిన పంటలను మంగళవారం పరిశీలించారు. ఉన్నతాధికారులు సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి న్యాయం చేయాలని కోరారు.