Jul 12,2023 21:49

బస్సుయాత్రలో మాట్లాడుతున్న కళావెంకట్రావు

వీరఘట్టం: గాలిలో తిరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ప్రజా సమస్యలు పట్టవని మాజీ మంత్రి పోలిట్‌ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. మండలంలోని విక్రాంపురంలో భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి బటన్‌ నొక్కడం తప్ప మరేమీ తెలియదన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నిన్నటి వరకూ ధాన్యం కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు గురైనట్లు ఆయన గుర్తు చేశారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అభివృద్ధి విస్తరణ పనులు చేపట్టి రెండేళ్లయినా ఇప్పటికీ పనులు పూర్తికాలేదన్నారు. చేసిన పనులకు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించలేదని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలంతా జగన్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నుండి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని దారి పొడవున బైక్‌ ర్యాలీ నిర్వహించి వైసిపి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జి నిమ్మక జయకృష్ణ, మాజీ స్పీకర్‌ ప్రతిభ భారతి, గిడ్డి ఈశ్వరి, తోయక జగదీశ్వరి, బొబ్బిలి చిరంజీవి, పొదిలాపు కృష్ణమూర్తినాయుడు, మండల అధ్యక్షులు ఉదయాన ఉదయ భాస్కర్‌, పట్టణ అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ, పారిచర్ల వెంకటరమణ, మాచర్ల అనిల్‌, పొన్నాడ నాగేశ్వరరావు, మాచర్ల నందీశ్వర రావు, గండిరామినాయుడు, వారాడ సుమంత్‌, కండాపు వెంకటరమణ, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సీతంపేట: భవిష్యత్తు గ్యారెంటీ బస్సు యాత్ర భాగంగా సీతంపేటలో పాలకొండ నియోజకవర్గం ఇంచార్జ్‌ నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం రాగానే యువతకు ఉద్యోగులు కల్పిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో ప్రజలు ఆకర్షితులై బ్రహ్మరథం పడుతున్నారని పాలకొండ నియోజకవర్గం ఇన్చార్జి జయకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభ భారతి, కె. అప్పలనాయుడు, బిడ్డిక చందర్రావు, మండల అధ్యక్షులు సవర తోట మొఖ లింగం తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ : రాబోయే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందనికిమిడి కళావెంకటరావు అన్నారు. బస్సు యాత్ర పాలకొండకు చేరుకుంది. ఈ సందర్భంగా జంపరకోట ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గ సమస్యలు పాలకులు పట్టించుకున్న దాఖలాల్లేవని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్‌ ప్రతిభ భారతి, జయమణి, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌ నిమ్మక జయకష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు గండి రామినాయుడు, పట్టణ పార్టీ అధ్యక్షులు గంటా సంతోష్‌ తదితరులు ఉన్నారు.
భామిని : స్థానిక కొరమ కూడలి నుంచి బత్తిలి వరకు నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారంటీ చైతన్య బస్సు యాత్ర నిర్వహించారు. మండలంలోని 3 కిలోమీటర్ల యాత్రలో టిడిపి కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో ఉత్సాహంగా పాల్గొని ప్రతి గ్రామంలో జయకృష్ణకు హారతులతో స్వాగతం పలికారు. అనంతరం బత్తిలిలో జరిగిన సభలో జయకృష్ణ మాట్లాడారు. కార్యక్రమం నియోజక వర్గ పరిశీలకులు కలమట విద్యాసాగర్‌, కిమిడి నాగార్జున, మండలి అధ్యక్షులు బోగాపురపు రవి నాయుడు, ప్రధాన కార్యదర్శి మెడిబోయిన జగదీశ్వరరావు, భూపతి ఆనందరావు, సాకేటి రామారావు, లోపింటి రాజేష్‌, కోరాడ రాజేష్‌, బిడ్డికి ప్రసాద్‌, కొల్ల మధు, అంపిలి కేశవ మరియు టి డి పి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.