Dec 16,2022 23:06

ప్రజాశక్తి - భవానీపురం 

మైనార్టీల సంక్షేమం కోసం జగన్‌ చేసింది శూన్యమని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. శుక్రవారం భవానీపురంలో గల 450 ఏళ్ళ చరిత్ర కలిగిన హజరత్‌ సయ్యద్‌ గాలిబ్‌ షాహీద్‌ దర్గాను పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సందర్శించి, స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీ కుటుంబం కోసం మతగురువులతో ప్రతేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.