Sep 14,2023 23:22

చిత్తూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీనివాసులు

గాలి కాలుష్యాన్ని నియంత్రించాలి:ఎమ్మెల్యే
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): వాతావరణంలో విపరీత మార్పులు చోటుచేసుకుంటున్నాయని కాలుష్యాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తులో ప్రమాదాలు తప్ప వని, ప్రజలు స్వచ్ఛందంగా కాలుష్య కారకాలను వీడాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీనివాసులు సూచించారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం తిరుపతి, చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ ఎయిర్‌ ఫర్‌ బ్లూస్కెస్‌ సందర్భంగా కాలుష్య నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ ఇంజినీర్‌ నరేంద్రబాబు మాట్లాడుతూ చిత్తూరు ముప్సిపల్‌ కార్పొరేషన్‌ సహకారంతో గత రెండు సంవత్సరాలుగా గాలిలో కాలుష్య కారకాలను గుర్తించి నియంత్రించి గాలి నాణ్యతను సామాన్య స్థితికి తీసుకరావడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్‌ అముద, అధికారులు కుమార్‌, శిల్ప, కార్పొరేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.