Nov 09,2023 00:35

ప్రజాశక్తి-తాడేపల్లి : గాజాపై ఇజ్రాయిల్‌ దాడులను వెంటనే నిలుపుదల చేయాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. ఇప్పటికే వేలాది మంది ప్రజల మారణానికి కారణమైన ఇజ్రాయిల్‌పై ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి పెంచాలని కోరారు. యుద్ధ నివారణ వెంటనే చేపట్టాలని కోరుతూ బుధవారం రాత్రి తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌లో కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లా డుతూ గాజాలో ప్రస్తుతం ప్రజలకు నిత్యావస రాలతో సహా మందులు, తాగునీరు కూడా అందుబాటులో లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి చేసిన శాంతి ప్రతిపాదనలను అమెరికా దన్నుతో ఇజ్రాయిల్‌ తోసిపుచ్చడం అమానవీయ చర్యన్నారు. ప్రతి రోజూ సుమారు 130 మంది పిల్లలు ఈ దాడు ల్లో బలైపోతున్నారంటే పరిస్థితి ఎంత దయనీ యంగా ఉందో అర్థమవుతుందన్నారు. యుద్ధం మొదలైన నెల రోజుల్లో నాలుగు వేల మంది చిన్నారులతో సహా పది వేల మంది పాలస్తీ నీయులు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్‌లో 1400 మంది మృత్యు వాత పడ్డారని చెప్పారు. ప్రదర్శనలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, నాకులు డి.శ్రీనివాస కుమారి, కె.కరుణాకరరావు, కె.మేరి, ఎ.శౌరిబ ర్తులం, తులసమ్మ, గోపిరెడ్డి, డి.విజయబాబు, రామచంద్రరావు, ఎల్‌.ఆచారి పాల్గొన్నారు.