చిలకలూరిపేట: పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో జనవిజ్ఞాన వేదిక, గ్రంథాలయ అభి వద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమ పితామహులు గాడిచర్ల హరి సర్వో త్తమరావు 140వ జయంతి కార్యక్రమం శుక్రవారం జరి గింది. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి జెవివి రాష్ట్ర కార్యదర్శి దార్ల బుజ్జిబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి ప్రముఖ సాహితీ విమర్శకు లు డా. పివి సుబ్బారావు మాట్లాడుతూ కాలేజీ చదివే రోజుల్లోనే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపిన తొలి తెలుగు రాజకీయ ఖైదీ గాడిచర్ల అని, దత్త మండ లాలకు రాయలసీమ అని పేరుపెట్టింది గాడిచర్ల అని గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి నాగుల్ మీరావలి, ఎమ్.రాధాకష్ణ, ఉప్పాల భాస్కరావు, కస్తూరి వెంకటేశ్వర్లు, చుక్కా విన్సెంట్ పాల్, సరోజిని పాల్గొన్నారు.










