Feb 23,2023 16:13

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : భారత్లో జి20 జరగడం మనందరికీ గర్వకారణమని పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కోటేశ్వరయ్య. పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత్ లో ఏడాది సెప్టెంబర్ లో జరుగునున్న జి20 సదస్సుపై అవగాహన కార్యక్రమము ఎస్సిసి విభాగం నిర్వహించు కార్యక్రమం కళాశాల వైస్  ప్రిన్సిపాల్ కోటేశ్వరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీ 20 సదస్సు భారత్లో మొదటిసారి జరిగినట్లు అందరికీ గర్వకారము అన్నారు. అనంతరంకి నరసింహులు అర్థశాస్త్రం అధ్యాపకులు ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక శక్తులు అతి వేగంగా అభివృద్ధి చెందుతుంది ఆర్థిక వ్యవస్థలు గల దేశాన్ని నేతలు సదస్సుకు హాజరవుతున్నారు మన దేశం 1999 నుంచి g20 సభ్య దేశంగా ఉందన్నారు. అనంతరం రాజనీతి శాస్త్రం అధ్యాపకులు అధ్యాపకులు మాట్లాడుతూ జీ 20 ఏర్పాటు అవటం వెనుక గల చరిత్ర తెలిపారు. అనంతరం ఎన్ఎస్ఎస్ అధికారి ఎం శ్రీనివాసులు. జి20-2023 సదస్సుకు సంబంధించిన లోగో వెబ్సైట్ వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్. విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.