Sep 29,2023 16:19

ప్రజాశక్తి-గణపవరం : మండలంలో సిహెచ్ అగ్రహారంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ చుక్క అప్పారావు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో స్థానికులకు దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన రోగాలకు బీపీ షుగర్ ఇతర అనారోగ్య లవారికి ప్రభుత్వం గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యం అందిస్తుందని చెప్పారు. వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పీవీ నారాయణ పీహెచ్ఎం అన్నకుమారి ఆరోగ్య సహాయకులు నామాల రాజు ఏఎన్ఎం ఏసమ్మ ఎం ఎల్ హెచ్ పి మాధురి పాల్గొన్నారు.