Apr 03,2023 16:23

ప్రజాశక్తి-వాకాడు: నారాయణ ఉచిత వైద్య సలహా శిబిరం చిట్టమూరు మండలంలోని చిట్టమూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నెల్లూరు నారాయణ వైద్యశాల డాక్టర్ల బృందంచే ఉచిత సలహా వైద్య శిబిరంను సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమం గూడూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాశం సునిల్ కుమార్ సూచనల మేరకు, టీడీపీ మండలపార్టీ అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు అధ్యర్యంలో డాక్టర్ రంజిత్ (జనరల్ ఫిజీషియన్), డాక్టర్ కరిష్మా (కంటి వైద్య నిపుణులు) మరియు వారి బృందం రాఘవేంద్ర ,హర్ష లచే సేవలందించారు. దీని ద్వారా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన పేద ప్రజలకు ఎటువంటి ఫీజు లేకుండా వైద్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంపర్ల చిన్నారావు (మాజీ జడ్పీటీసీ), మారంరెడ్డి జనార్దన్ రెడ్డి (జిల్లా రైతు అధికార ప్రతినిధి),నల్లారెడ్డి రాజేష్ రెడ్డి(జిల్లా యువత ఉపాధ్యక్షులు)గుంపర్ల శ్రీనివాసులు, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి గుండుబోయిన కస్తూరయ్య, నియోజకవర్గ ప్రధానకార్యదర్శి మునిబాబు నాయుడు, సీనియర్ నాయకులు బసవనూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.