Jan 22,2023 15:53

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : వడమాల పేట మండలం వనమాల గ్రామంలో జి జి పి ఫండ్స్ ద్వారా ఐదు లక్షల రూపాయలు మరియు ఎమ్మెల్యే ఫండ్స్ 10 లక్షల రూపాయల 15 లక్షల అంచనా వ్యాయామంతో. నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను ఆదివారం. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి  ఆర్.కె.రోజా ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యంగా. నిర్మాణం చేసి. త్వరగా పనులు పూర్తి చేసి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేపట్టాలని తెలిపారుఈ కార్యక్రమంలో వడమాల పేట ఎంపీపీ, విజయలక్ష్మి  వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు,  రాష్ట్ర డైరెక్టర్లు , కమిటీ చైర్మన్లు, సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు మండల అధికారులు,  పాల్గొన్నారు.