Jul 06,2023 11:07

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారికి బెంగళూరుకు చెందిన కోదండరెడ్డి గురువారం రూ.14 ల‌క్ష‌ల విలువైన ఒక ఫోర్స్ ట్రావెలర్ వాహనంను విరాళంగా అందజేశారు. శ్రీ‌వారి ఆల‌యం ఎదుట పూజ‌లు నిర్వ‌హించి, వాహ‌నం తాలూకు తాళలను, డాకుమెంట్స్ ను ఈవో ఏవి ధర్మారెడ్డికి దాత అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ జానకిరామిరెడ్డి, అన్న ప్రసాదం ప్రత్యేకాధికారి శాస్త్రి పాల్గొన్నారు.