Jul 24,2023 15:24

అల్లూరి-విఆర్ పురం: మండలంలోని అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అన్నవరం ఉమ్మడివరం మధ్యలో గల ఉన్న బ్రిడ్జి పైకి పొంగటంతో మండలానికి 40 గ్రామాలు నిలిచిపోయాయని ఓ పక్క గోదావరి వరద తగ్గుముఖం పట్టిన వర్షాలుకు వాగులు పొంగటంతో రహదారులు ఇంకా బయటపడలేదు అన్నవరం గ్రామం. ఉమ్మడివరం గ్రామం మధ్యలో ఉన్న  బ్రిడ్జి మునగటంతో 40 గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఈరోజు సోమవారం సంత కావడంతో నిత్యవసర సరుకుల కోసం గ్రామాల నుండి ప్రజలు కొనుగోలు చేయడానికి వి ఆర్ పురం మండలానికి వస్తూ అదే రోజు బ్యాంకు పనులు మండల కార్యాలయానికి వస్తూ ఉంటారు రాత్రి కురిసిన వర్షానికి కొండలలో నుండి వచ్చే వర్షం నీరు అన్నవరం వద్ద బ్రిడ్జి మునగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఐదు రోజులుగా పునరవాస కేంద్రాల్లో ఉన్న ఇంతవరకు ఏ అధికారి పట్టించుకోలేదని సరుకులు ఇవ్వలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గోదావరి స్వల్పంగా తగ్గుముఖం పట్టిన రహదారులు బయటపడలేదని నిత్యవసర సరుకుల కోసం రావాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని అధికారులు పునరావాస కేంద్రాలకు వచ్చి నిత్యవసర సరుకులు ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేశారు..