May 22,2023 15:35
  •  వణుకుతున్నపోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు 

ప్రజాశక్తి-విఆర్ పురం:  జులై నెల అంటే భయంతో పోలవరం ప్రాజెక్టు నిర్వా తులు ఉక్కిరిబిక్కిరి అవుతు న్నారు. 2022 జూన్ మాసం ఎన్నడూ ఎవ్వరూ చని రీతిలో గోదావరి ఉగ్రరూ పం దాల్చడంతో కూనవరం, వర రామచంద్రాపురం మండలాల ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో గుట్టల వెంట, అడవుల్లో తలదాచుకున్నారు. త్రాగేందుకు నీరు లేక, కడుపునిండా రెండు పూటలా అన్నం లేక, బిక్కుబిక్కుమంటూ జీవత్సవాళ్ళలా చెట్టు కొకరు, పుట్టకొకరు, ఉన్నారు. భయంతో వణికిపోయారు. విద్యుత్ సరఫరా లేక నానా అవస్థలు పడ్డారు. గ్రామాలను శుద్ధి చేయడానికి జిల్లా కేంద్రం, డివిజన్ నుండి పారిశుద్ధ్య కార్మికులను తీసుకువచ్చి గ్రామాలను శుభ్రపరచడం విశేషం. అంటే ఏస్థాయి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అధికారులకు తెలుసు, ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ గోదావరి వరదలు వస్తే పరిస్థితి ఏంటని పోలవరం నిర్వాసితులు భయాందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనా ఈసారి వరదలకు ప్రభుత్వం నిర్వాసితులను వరదల్లో ముంచేస్తుందో లేక ప్రసన్నాయం ఏమన్నా చూపిస్తుందేమోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత వరదలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి పది వేలు ఇస్తానని మాట ఇచ్చి ఇంతవరకు ఇవ్వలేదని వరదల్లో 2000 రూపాయలు ఇచ్చి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక నూనె ప్యాకెట్లు తప్ప ఏమి ఇవ్వలేదని ఈసారి వరదలకు ముందే మాకు ప్యాకేజీ ఇచ్చి పంపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.