Apr 14,2023 15:37

ప్రజాశక్తి ‌- పుత్తూరు టౌన్ : రాష్ట్ర విపత్తు స్పందన మరియు  అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారము నుంచి పుత్తూరులో  అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమవుతాయని అగ్నిమాపక దళ అధికారి నేతాజీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వారోత్సవాల కరపత్రాలను విడుదల చేసి ఆవరణంలో మొక్కలు నాటారు. ఈనెల 20వ తేదీ వరకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. అగ్ని ప్రమాదాలు విపత్తులు చోటు చేసుకున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ లు ఉమాపతి, రామస్వామి, డ్రైవర్లు మనోజ్, విశ్వనాధ్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.