ప్రజాశక్తి-రాజవొమ్మంగి : మండలంలోని లబ్బర్తి గ్రామంలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో తాటాకీళ్లు దగ్ధమై రూ.1 లక్ష ఆస్తి నష్టం సంభవించింది. గ్రామస్తులు కథనం ప్రకారం, లబ్బర్ది గ్రామంలోని సత్యవతికి చెందిన తాటాకు ఇంటిలో గ్యాస్ స్టవ్ పై వంట చేస్తుండగా నిప్పురవ్వలు ఎగసిపడి తాటాకు ఇంటికి మంటలు వ్యాపించడంతో సత్యవతి భయంతో బయటకు పరుగులు తీసింది. ఇది గమనించిన గ్రామస్తులు మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా నీటితో ఆర్పి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ అగ్ని ప్రమాదంలో తాటాకిళ్లు పూర్తిగా దగ్ధం కాగా సత్యవతి చెందిన ఇంట్లో కొన్ని వస్తువులు కాలిపోయాయి.










