ప్రజాశక్తి - కోట : కోట మండలం సిద్దవరం పంచాయతీ పరిధిలోని ఇళ్లకూరుపాడు గ్రామంలో నివాసకుంటున్న మానికల కస్తూరమ్మకు చెందిన పూరిల్లు శనివారం రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. మంటలు వ్యాపిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్నటువంటి మానికల కస్తూరమ్మ ఆమె కుమార్తె వెంటనే బయటకు పరుగులు తీశారు.ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్నటువంటి బట్టలు,వంట సామాగ్రి, అన్ని కాలి బూడిద అయ్యాయి.గిరిజన కుటుంబానికి చెందిన మాలికల కస్తరమ్మకు ఒక కుమార్తె ఉంది.పూట గడవడమే కష్టంగా జీవిస్తుంది. ఇప్పుడిప్పుడే మూడు పూటలా పస్తులేకుండా అన్నం తినగలుగుతున్నాము అనే సమయంలో విధి వీరిని నిరాశ్రయులను చేసింది. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన మాణికల కస్తూరమ్మ దాతల సహాయ సహకారాలు కోరుతున్నారు.










