ప్రజాశక్తి-కోట : కోట మండలం గూడలి పంచాయితీ పరిధిలో ఉన్న ప్రకాశం కాలనీలో నివాసం ఉంటున్న కటికాల. నారాయణ అనే వ్యక్తి గత ఎన్నో సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతుండేవాడు. ఈ విషయం పలువురి ద్వారా శ్రీ షిరిడి అక్షయ సేవా సమితి నిర్వాహకులు అల్లం. రమణయ్య చెవిన పడింది. అయితే విషయం తెలుసుకున్న అల్లం. రమణయ్య బుధవారం కటికాల.నారాయణ ఇంటికి వెళ్లి మందుల ఖర్చు నిమిత్తం 2000 రూపాయలను అందజేశారు. అదేవిధంగా గతంలో కూడా కటికాల నారాయణకు 5000 రూపాయలను అందజేశామని శ్రీ శిరిడి అక్షయ సేవా సమితి నిర్వాహకులు అల్లం.రమణయ్య గుర్తు చేశారు. అనంతరం కటికాల.నారాయణ కుటుంబం నిర్వాహకులైన అల్లం.రమణయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఆయనతో పాటు బాబురావు ఉన్నారు .










