ప్రజాశక్తి-విశాఖపట్నం: ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర తెలుగు అకాడమి చైర్‌పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి సోమవారం సందర్శించారు. వీసీ ఆచార్య ప్రసాదరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లకీëపార్వతి మాట్లాడుతూ, సాహిత్యం మానసిక వికాసానికి దోహదపడుతుందన్నారు. జ్ఞానాన్ని, హితాన్ని అందించే శక్తి సాహిత్యానికి ఉందన్నారు. ఏయూలో విరివిగా సాహిత్య కార్యాక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. సంస్కారవంతమైన యువతను తయారుచేసే దిశగా ఎయు చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వీసీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ అందరి సహకారం, సూచనలతో విశ్వవిద్యాలయం ప్రగతికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామన్నారు. ఎయు అభివృద్దికి మంచి సూచనలు ఇవ్వాలన్నారు. ఎయులో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాదరెడ్డిని లక్ష్మీపార్వతి సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.










