
మంగళగిరి: ఎయిమ్స్ లో రోగులు పడుతున్న సమ స్యలను అధికారులు పరిష్కరించాలని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కె విఎస్ సాయిప్రసాద్ గురువారం తెలిపారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గతంలో ఎయిమ్స్ వైద్యశాలను సందర్శించి నట్లు చెప్పారు. ఎయిమ్స్ ముఖ్య సంచాల కులు డాక్టర్ ముఖేష్ త్రిపాఠిని కలిసి, ఆయన దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చి నట్లు చెప్పారు. కొన్ని ముఖ్య సమస్యలు ఈ మధ్య మళ్లీ ఎయిమ్స్ వైద్యశాలను సంద ర్శించినప్పుడు గమనించామని అన్నారు.ప్రజలు సుదూర ప్రాంతాల నుండి కర్నూలు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల నుండి వస్తున్నారని, ఒపి రిజిస్ట్రేషన్ కోసం వారు చాలా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఎబిహెచ్‌ఎ యాప్‌లో నమోదు చేసుకోవడం చాలా సంక్లిష్టంగా ఉంటోం దని, దానికి సహాయ కేంద్రం ఉన్నా రోగులు ఇబ్బంది పడుతున్నారని, నమోదు కేంద్రా ల సంఖ్యను పెంచాలని చెప్పారు. అలాగే సాధారణంగా వచ్చే రోగులకు , చదువు లేని రోగులకు వ్యక్తిగత సహాయకులు అవసర మని, ఒపిలో ఎలా నమోదు చేసుకోవాలి, ఏ విభాగానికి ఎలా వెళ్లాలి, రక్త పరీక్షలు, మందులు తీసుకోవటానికి , అడ్మిట్ అవ్వటానికి వచ్చే రోగులకు సహకరిం చాలని కోరారు. రక్త, మూత్ర పరీక్షలు చేసే చోట చాలా ఆలస్యం అవుతోందని, పరీక్ష చేసే కేంద్రాల సంఖ్యను పెంచాలని, రిపోర్టు లను త్వరగా ఇచ్చే విధంగా చూడాలని, స్కానింగ్ కేంద్రాలను, సిబ్బందిని పెంచాలని, స్కానింగ్‌కు రెండుమూడు నెలల తర్వాత అపాయింట్ మెంట్ ఇస్తున్నారని కొంతమంది రోగులు చెబుతున్నారని తెలిపారు. ఆపరేషన్ల కోసం కూడా చాలా మంది రోగులు ఎదురు చూస్తున్నారని, అత్యవసర సేవలు ఇంకా మెరుగు పరచాలని కోరారు. ఆసుపత్రిలో హృద్రోగ నిపుణులు లేరని, త్వరగా వారిని నియ మించాలని ప్రజలుక కోరుతున్నారు. కేన్సర్ విభాగం, పిల్లల ఆపరేషన్ విభాగం ప్రాచుర్యం లోకి తీసుకు రావాలని,ముఖ్యంగా రవాణా సౌకర్యాలు ఇంకా మెరుగు పరచాలని, సాయంత్రం 6 గంటల తరవాత బస్సు సౌకర్యాలు అందుబాటులో లేవని అన్నారు. ఎయిమ్స్‌కు ముఖ్యంగా తాగునీటి వసతిని త్వరగా కల్పించాలని అన్నారు. గతంలో తాగునీటి సౌకర్యం కలిపిస్తున్నట్లుగా అధికారులు, మంత్రులు చెప్పి నప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. సందర్శకుల కోసం, వైద్య పరీక్షల కోసం రెండుమూడు రోజులు ఉండాల్సిన వారి కోసం వసతి సౌకర్యం కల్పించాలని కోరారు.